నకిలీ సోయా విత్తనాల వల్ల పంట నష్టోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. జిల్లాలోని జైనథ్ మండలం గూడ సిరసన్న గ్రామంలో మొలకెత్తని రాయితీ సోయా విత్తనాల పంట క్షేత్రాలను భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌తో కలిసి ఎంపీ సోయం సందర్శించారు.
రైతులు తమ గోడును ఎంపీకి వివరించారు. రాయితీపై ఇచ్చిన విత్తనాలు మొలకెత్తలేదని... కొత్త విత్తనాలు కొందామంటే అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తాము అండగా ఉంటామని బాధిత రైతులకు సోయం బాపురావు హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కారణంగా ప్రభుత్వం పైనా పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు.
ఇదీ చూడండి:చైనాతో వివాదంపై నేడు ప్రధాని అఖిలపక్ష భేటీ