ఆదిలాబాద్ పురపాలకంలో నాసిరకం పనులు జరుగుతున్నాయంటూ కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లోపంపై వారు మండిపడ్డారు. పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ బల్దియా సమావేశం వాడీవేడిగా కొనసాగింది.
సమావేశారంభం నుంచి ముగిసేవరకు సభ్యులు ఆయా సమస్యలను ప్రస్తావించారు. ఈ క్రమంలో ఎజెండాలోని అంశాల చర్చపై అధికారపార్టీ సభ్యుల నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. భాజపా సభ్యురాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే సమావేశం ముగించగా.. ఆ పార్టీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఛైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. రూ. 30లక్షల బడ్జెట్‌కు సభ్యులంతా ఆమోదం తెలపటంతో సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి: గర్భవతి చేసి వదిలేశావని నిలదీస్తే.. హెచ్ఆర్సీలోనే కొట్టాడు!