లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందుతున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును వెంటనే బర్తరఫ్ చేయాలని.. తెలంగాణ లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉద్యమం చేయడం వెనుక ఆయన రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించారు.
ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలపై అసలు ఉద్దేశాన్ని భాజపా స్పష్టం చేయాలని బెల్లయ్య డిమాండ్ చేశారు. లంబాడీ హక్కులకు భంగం కలిగిస్తున్న సోయం బాపురావు.. తన వైఖరి మార్చుకోకుంటే ఫిబ్రవరి 15 నుంచి లంబాడీ తండాలకు రానివ్వబోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: భాగ్యనగరంలో కజికిస్థాన్ దౌత్యకార్యాలయం ప్రారంభం