ETV Bharat / state

Students Deaths in RGUKT Basara : ఈ చావులకు బాధ్యులెవరూ..?

Likitha death in iiit basara : నిర్వహణ లోపమో.. అధికారుల నిర్లక్ష్యమో.. పిల్లల సున్నితత్వమో తెలీదు కానీ.. అభం శుభం తెలియని విద్యార్థులు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థుల మరణం.. అందరినీ కలచి వేస్తోంది. ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలోనే ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

iiit basara
iiit basara
author img

By

Published : Jun 15, 2023, 9:31 PM IST

students Suicides in iiit basara RGUKT : నిర్మల్‌ జిల్లా బాసర ఆర్​జేకేయూటీలో విద్యార్థుల మరణాలు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల క్రితం విద్యార్థిని దీపిక బాత్రుంలో చున్నీతో ఉరేసుకుని మృతి చెందగా.. తాజాగా తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న లిఖిత అనే మరో విద్యార్థిని భవనంపై నుంచి పడి మరణించింది.

వరుసగా రెండు రోజుల్లో.. రెండు మరణాలు... ఒకరిది ఆత్మహత్యగా అధికారులు నిర్ధారణ చేయగా.. మరొకరిది భవనం పైనుంచి పడిన ప్రమాదంగా తేల్చారు. ముందుగా ఆత్మహత్య అంటూ అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు సైతం.. తర్వాత మాట మార్చారు. మా పాపకు జరిగింది ప్రమాదమే అని చెబుతున్నారు. లిఖిత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించగా.. స్వస్థలం గజ్వేల్‌కు తరలించారు.

బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. విచారణ తర్వాతే పూర్తి నిజానిజాలు వెలుగులోకి వస్తాయని డీసీపీ జీవన్‌రెడ్డి చెబుతున్నారు. మరోవైపు ప్రమాదం జరిగితేనే అలాంటి గాయాలు ఉంటాయంటూ లిఖిత మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యుడు అంటున్నారు.

ట్రిపుల్‌- ఐటీలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించట్లేదని దానివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. దీనికి సంబంధిత శాఖ మంత్రి, అధికారులు తప్పకుండా బాధ్యత వహించాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

లిఖిత మృతిపై అధికారుల మాటలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరతగతిన విచారణ పూర్తి చేసి నిగ్గు తేల్చి... విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.

"తరువాత రోజు పరీక్ష ఉండటం వల్ల యూట్యూబ్​లో వీడియోలు చూస్తూ నాలుగో అంతస్థు నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిందని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు 174 సీఆర్​పీసీ కింద కేసు నమోదు చేశాము. పంచనామా చేసిన అనంతరం ప్రమాదమా.. ఉద్దేశపూర్వకంగా జరిగిందా అన్న విషయం తెలియనుంది. విచారణ తర్వాతే పూర్తి నిజనిజాలు వెలుగులోకి వస్తాయి". - జీవన్‌రెడ్డి, డీసీపీ

ఈ చావులకు బాధ్యులెవరూ..మృత్యుస్థావరంగా ఐఐఐటీ ప్రాంగణం

"తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో లిఖిత అనే అమ్మాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకువచ్చారు. భవనం పై నుంచి కిందికి పడటం వల్ల గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందకి పడటంతో లిఖిత మరణించింది". - వేణు, వైద్యుడు

"ట్రిపుల్‌- ఐటీ బాసరలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్​జీయూకేటీ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందిచాలి". - శ్రీహరిరావు, కాంగ్రెస్‌ నాయకుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.