food poison: ఆదిలాబాద్‌లోని భీంపూర్ మండలానికి చెందిన కస్తూర్భా గాంధీ పాఠశాలలో భోజనం విషతుల్యంగా మారింది. ఫలితంగా 32 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. అధికారుల పర్యవేక్షణలేకపోవడంతో మెను ప్రకారం గుత్తేదారు భోజనం ఏర్పాటు చేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శుక్రవారం రాత్రి భోజనం చేశాక అర్ధరాత్రి ఒక్కో విద్యార్థిని కడుపునొప్పితో వాంతులు, విరేచనాలు చేసుకోవడం ఆందోళనకు దారితీసింది. కొంతమంది నొప్పిభరించలేక కంటతడిపెట్టారు. మరికొందరు శనివారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకొని పాఠశాలకు వచ్చిన అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషాను విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతోనే ప్రభుత్వ వసతి గృహాల్లో.. ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయని నేతలు ఆందోళన చేయడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి: Food Poison: అల్పాహారం వికటించి 43 మంది బాలికలకు అస్వస్థత