ETV Bharat / state

చదువులోనే కాదు కరాటేలోనూ సత్తా చాటుతున్న బాలికలు

సాధారణంగా పాఠశాల అంటే చదువు బోధిస్తారు. ఇక్కడ మాత్రం విద్యతో పాటు కరాటే కూడా నేర్పిస్తున్నారు. ఆపద సమయంలో బాలికలు తమను తాము ఎలా రక్షించుకోవాలో ఆపోసన పడుతున్నారు. కరాటే ప్రావీణ్యాన్ని పెంచుకుంటూ పథకాలు సాధిస్తున్నారు ఆదిలాబాద్​ ఇచ్చోడ కస్తూర్బా గాంధీ విద్యార్థినులు.

author img

By

Published : Mar 23, 2019, 3:25 PM IST

Updated : Mar 23, 2019, 4:01 PM IST

సాధన చేస్తూ
కరాటేలో సత్తా చాటుతున్న బాలికలు
బాలికలకు తెలివితేటలే కాదు యుద్ధ విద్యలు కూడా అవసరమే. ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు ఆత్మ రక్షణ శక్తి ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడకస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు కరాటేలో ప్రావీణ్యం పొంది ప్రతిభనుచాటుతున్నారు.

4 రకాల అంశాలు

బోధనతో పాటు ప్రత్యేకంగా బాలికలు, మహిళలపై జరుగుతున్న వేధింపులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ సాహస విద్యను నేర్పిస్తున్నారు. కరాటేలో నిపుణుడైన రాజు 14 రకాల అంశాలను ఇక్కడ బోధిస్తున్నారు.

ప్రతిభపురస్కారాలు

ఇటీవల బెల్లంపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో తొమ్మిది మంది విద్యార్థినులు సత్తా చాటి ప్రతిభాపురస్కారాలను అందుకున్నారు. కరాటేతో ధైర్యసాహసాలతో పాటు ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొనే శక్తి వస్తుందని బాలికలు చెబుతున్నారు.

పిరమిడ్ కరాటే

కరాటేలో రకరకాల విన్యాసాలతో పాటుపిరమిడ్ కరాటేను నేర్చుకున్నారు. అన్ని రకాల అంశాలను అలవోకగా ప్రదర్శిస్తూ శత్రువును ఎలా ఎదుర్కోవాలో చూపిస్తున్నారు ఈ విద్యార్థినులు.

ఇవీ చూడండి:కేసీఆర్ బహిరంగ సభలు... కేటీఆర్​ రోడ్​ షోలు

Intro:tg_adb_92_21_kgbvbalikalu_karatelomerikalu_avb_c9
tg_adb_92a_21_kgbvbalikalu_karatelomerikalu_avb_c9
tg_adb_92b_21_kgbvbalikalu_karatelomerikalu_avb_c9
tg_adb_92c_21_kgbvbalikalu_karatelomerikalu_avb_c9
tg_adb_92d_21_kgbvbalikalu_karatelomerikalu_avb_c9
tg_adb_92e_21_kgbvbalikalu_karatelomerikalu_avb_c9

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
కస్తూర్బా పిల్లలు కరాటేలో మెరికలు
*కరాటే విద్యలో రాణిస్తున్న కేజీబీవీ విద్యార్థినిలు
*రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు సొంతం
------------------------
( ):- బాలికలకు తెలివితేటలే కాదు యుద్ధ విద్యలు అవసరమే తమకు తాము రక్షించుకునే ఆత్మ రక్షణ శక్తిని కలిగి ఉండాలని ప్రభుత్వం సదుద్దేశంతో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కరాటే విద్యను చదువుతోపాటు బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ బాలికల కస్తూర్బా గాంధీ విద్యార్థినులు కరాటే సాధనలో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు ఇటీవల బెల్లంపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో తొమ్మిది మంది విద్యార్థినులు ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు ఇప్పటికే పలు కళాత్మక స్వయం ఉపాధి అంశాల్లో రాణిస్తున్నారు. బోధనతోపాటు ప్రత్యేకంగా ప్రస్తుతం బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న వేధింపులు, అన్యాయాలు, భయాందోళన అధైర్యం భయాందోళన తొలగించి వారిని దృఢంగా తీర్చి దిద్దేందుకు సాహస విద్యను నేర్పిస్తున్నారు
ఇచ్చోడ బాలికల కస్తూర్బా గాంధీ పాఠశాలలో పిల్లలు అలవోకగా కరాటేను ఆసక్తిగా నేర్చుకుంటున్నారు కరాటే సాధనలో నిపుణుడైన రాజుతో 14 రకాల అంశాలను ఇక్కడ బోధిస్తున్నారు అందులో పటాస్ పన్చ్ అప్పర్ బ్లాక్ బ్లాక్ సింగిల్ పంచ్ సిడికిక్, రౌండ్ అప్ పిక్ స్తామక్ ఎక్సేర్సీజ్ మూవీస్ కిక్ మూవీ ఎటాక్ జాగింగ్ తదితర అంశాల్లో సాధన చేస్తూ ప్రతిభ కనబరుస్తున్నారు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో తొమ్మిది మంది విద్యార్థులు తమ సత్తా చాటి అవార్డులు ప్రశంసలు పొందారు కరాటే నిపుణుడు బోధిస్తున్న ప్రతి అంశాన్ని ప్రత్యేక శ్రద్ధ పట్టుదలతో సాధన చేస్తూ ఆయన చెప్పే ప్రతి అంశాన్ని గమనిస్తూ సులువుగా నేర్చుకుంటున్నారు కరాటే నైపుణ్యం సాధించడం వల్ల ధైర్యం సాహసంతో పాటు ఎటువంటి ఇబ్బందులైన ఎదుర్కొనే శక్తి కలుగుతుందని బాలికలు పేర్కొంటున్నారు ఇక్కడ మరో విశేషమేమిటంటే కరాటేలో ప్రత్యేక నిపుణతను సాధిస్తున్న బాలికలు సాహసాలను సైతం అలవోకగా చేస్తున్నారు ద్విచక్ర వాహనాలను చేతుల వేళ్ళు, పొట్టపై నుంచి వెళ్లనీయడంతో పాటుపిరమిడ్ కరాటను ప్రదర్శిస్తున్నారు అన్ని రకాల అంశాలను అలవోకగా ప్రదర్శిస్తూ శత్రువును ఎలా ఎదుర్కొనాలో అనే విధానాన్ని చూపించగలుగుతున్నారు. ఆడపిల్లలు ఈ సాహసంలో అనేక అంశాలను నేర్చుకుంటూ ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు గల విద్యార్థులకు వారంలో మూడు రోజుల పాటు కొన్ని సమయాల్లో రెండు పర్యాయాలు సాయంత్రం కాలాంశాల్లో ఈ పాఠశాలలో భోదిస్తున్నారు
.....

బైట్:- 1). ప్రియాంక తొమ్మిదవ,ఇచ్చోడ, ఆదిలాబాద్ జిల్లా
2). నందిని తొమ్మిదవ ఇచ్చోడ, ఆదిలాబాద్ జిల్లా
3).శ్వేత తొమ్మిదవ ఇచ్చోడ, ఆదిలాబాద్ జిల్లా
4).మల్లిక ఎస్ఒ, కేజీబీవీ ఇచ్చోడ, ఆదిలాబాద్ జిల్లా
5). రాజు కరాటే ,శిక్షకుడు ,ఇచ్చోడ, ఆదిలాబాద్ జిల్లా

Conclusion:.
Last Updated : Mar 23, 2019, 4:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.