ETV Bharat / state

సంకల్ప బలం ముందు ఓడిన క్యాన్సర్‌ - yuva story

ఆమెకు భరించడం తెలుసు..జయించడం తెలుసు...ఉబికివచ్చే కన్నీళ్లను ఆనందభాష్పాలుగా మార్చుకుంది. మృత్యువుకే సవాల్​ విసిరింది. అతి భయంకరమైన క్యాన్సర్​ను ఓడించి తాను గెలిచింది. తనలా మరొకరు బాధపడొద్దని ఆ వ్యాధిపై పరిశోధనలకు సమాయత్తమవుతోంది. ఇది డాక్టర్‌ గుణశ్వేత యథార్థగాధ.

special-story-about-guna-swathi-from-adilabad
సంకల్ప బలం ముందు ఓడిన క్యాన్సర్‌
author img

By

Published : Mar 14, 2020, 8:59 AM IST

స్టిక్స్​ సహాయంతో ఒకరు... వడివడిగా నడుచుకుంటూ వస్తోంది మరొకరు కాదు... ఇద్దరూ ఒక్కరే. నిజమా అని ఆశ్చర్యంగా ఉంది కదూ... కానీ గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే కఠోర నిజమిది. పీహెచ్​డీ సాధించిన ఈమె పేరు గుణస్వేత. ఆమె జీవితమేమీ సునాయసంగా సాగలేదు. అన్నీ కష్టాలే.

సంకల్ప బలం ముందు ఓడిన క్యాన్సర్‌

ఇంటర్​లోనే క్యాన్సర్​

ఆదిలాబాద్​ పట్టణంలోని టీచర్స్​ కాలనీలో నివాసం ఉండే కురగంటి గుణస్వేత చదువుతో పాటు బాస్కెట్​బాల్​, క్లాసికల్​ నృత్యంలో తనకు తానే సాటి. వైద్యురాలిగా స్థిరపడాలనేది ఆమె కోరిక. ఆమె పాఠశాల విద్యంతా ఆదిలాబాద్​లోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాగింది. 2005-06లో పదోతరగతి పరీక్షలకు వెళ్లిన తొలిరోజే ఆమె కుడి కాలికి బలమైన దెబ్బతగిలింది. తొలుత ఆ దెబ్బను పెద్దగా పట్టించుకోలేదు. పదోతరగతిలో ప్రథమశ్రేణిలో పాసైంది. గుంటూరులో ఇంటర్ చదివే సమయంలో కాలికి ప్రారంభమైన నొప్పి తీవ్రస్థాయికి చేరింది. స్థానిక వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో బయాప్సి పరీక్ష చేయించగా... క్యాన్సర్‌ నాలుగో స్టేజికి చేరిందనే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది.

ఒంటికాలితోనే జీవిత పయనం

హైదరాబాద్‌ నుంచి అదే ఏడాది చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ పరిశోధనా కేంద్రంలో చూపించగా.. ఆరుసార్లు కీమోథెరపి చేయాలనే వైద్యుల సూచన కుటుంబీకుల ఆశలు ఆవిరయ్యేలా చేసింది. కానీ గుణస్వేత ఎక్కడా కుంగిపోలేదు. మరో మూడుసార్లు కీమోథెరపి చేయకుండా క్యాన్సర్‌ సోకిన కుడికాలును మొత్తం తీసివేస్తే బతికే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఆ దశలోనే ధైర్యం చేసిన గుణస్వేత తనకాలు తీసివేయాలని వైద్యులను కోరింది. ఆమె అంగీకారంతో 2006 నవంబర్ 21న కాలు తొలిగించారు. బాస్కెట్‌బాల్‌, క్లాసికల్‌ నృత్యంలో రాణించాలనే ఆశయం ఆవిరైంది.

సంకల్పబలంతో ముందుకు

కాలు తీసివేశాక మరో మూడుసార్లు కీమోథెరపి చేయగా... శరీరంలో ఎక్కడా క్యాన్సర్‌ లక్షణాలు లేవని తేలింది. మళ్లీ చదువుపై దృష్టిసారించిన గుణస్వేత... గుంటూరులో కాకుండా... ఆదిలాబాద్‌లోనే ఒంటికాలితో ఇంటర్‌ బైపీసీ, డిగ్రీ ఎమ్మెస్సీ పూర్తిచేసింది. తరువాత 2012లో వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో క్యాంపస్‌ సీటు సాధించి 2014లో మైక్రోబయోలాజీలో ప్రథమశ్రేణిలో పాసై ... పీహెచ్​డీ చదువుకోసం జాతీయ ఫెలోషిప్‌ సాధించి తన సంకల్పబలాన్ని చాటిచెప్పింది.

పీహెచ్​డీలో క్యాన్సర్​ అంశం

తనలాగ మరొకరి కూతురు బాధపడకూడదనే ఆలోచనతోనే క్యాన్సర్‌ కారకమైన అంశాన్ని పీహెచ్​డీలో ఎన్నుకుంది. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం లభిస్తే హైలాండ్‌లో పోస్టు డాక్టరేట్ సాధిస్తానంటోంది. మెడలో స్టెతోస్కోప్‌కు బదులు... పీహెచ్‌డీతో డాక్టర్‌గా ఎదిగి పరిశోధకురాలిగా ఎదగడానికి గుండెధైర్యమేనని సగౌరవంగా ప్రకటిస్తుంటే తల్లిదండ్రుల్లో ఆనందం తొణికిసలాడుతోంది.

ఒంటికాలకి జతగా ఏర్పాటుచేసుకున్న కృత్రిమకాలితోనే గుణస్వేత అన్ని పనులు చేసుకుంటోంది. అసలు తనకు ఓ కాలులేదనే విషయమే పట్టించుకోని గుణస్వేత... తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా పిల్లలు తమకు తాముగా భవిష్యత్తును నిర్ధేశించుకోవాలని చెబుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.