ETV Bharat / state

కొవిడ్ బాధిత పోలీసులకు ప్రత్యేక పార్క్ - corona park

కొవిడ్ మ‌హ‌మ్మారి బీభ‌త్సం సృష్టిస్తోంది. జిల్లాలో.. సాధార‌ణ జ‌నంతో పాటు ప్రాణాలు అడ్డుపెట్టి విధులు నిర్వహిస్తూ క‌రోనా బారిన‌ పడుతోన్న పోలీసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి వారి కోసమే.. ఓ వినూత్న ఆలోచన చేశారు బోథ్ పోలీసులు. బాధితులు.. వ్యాయామం చేసుకునేందుకు వీలుగా వారి కోసం ఓ ప్రత్యేక పార్క్​ను ఏర్పాటు చేశారు.

park for covid effected police
park for covid effected police
author img

By

Published : Apr 27, 2021, 6:26 PM IST

కొవిడ్ బారిన పడ్డ పోలీసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. బాధితులను ఒత్తిడికి గురికాకుండా చేసేందుకు.. వారి కోసం ఓ ప్రత్యేక పార్క్​ను నిర్మించారు. జిల్లా ఇంఛార్జ్ యస్. పి. రాజేశ్​ చంద్ర ఈ ఉద్యానవనాన్ని ప్రారంభించారు.

మహమ్మారి బారిన పడ్డ పోలీసులు.. వ్యాయామం చేసుకునేందుకు వీలుగా పార్క్​లో అన్ని వసతులు ఉన్నాయని రాజేశ్​ చంద్ర వివరించారు. పార్క్​ ఏర్పాటులో బోథ్ పోలీసుల కృషిని ఆయన అభినందించారు. కరోనా తగ్గుముఖం పట్టిన అనంతరం.. పార్క్​ లోనికి పిల్లలతో పాటు అందరినీ అనుమతించనున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ చదవండి: 'కరోనా సోకితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.