ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాగతోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆటపాటలతో హోరేత్తించిన సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లకు ఘనంగా స్వాగతం పలికారు.
జానపద, సినీ గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలకు సహచర విద్యార్థులు కేరింతలు, చప్పట్లతో హోరెత్తించారు. విద్యార్థులతో జత కలిసిన అధ్యాపకులు నృత్యాలు చేసి ఆ కార్యక్రమానికి మరింత ఊపుతెచ్చారు.
ఇదీ చదవండి: హస్త కళాకారులకు చేయూతనిచ్చే గోల్కొండ క్రాఫ్ట్ బజార్