ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శ్రీరామ్ కాలనీలోని రాజరాజేశ్వరాలయంలో శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా సాగింది. కాలనీకి చెందిన దంపతులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఆసక్తిగా తిలకించారు. వేదపండితులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో పెళ్లి క్రతువు జరిగింది. స్వామివారి ప్రతిమలకు తలంబ్రాలు చల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఇవీ చూడండి : రామప్ప కాటన్ పేరుతో రానున్న కొత్త రకం చీరలు