ఆంద్ ఆదివాసీల ఆరాధ్య దైవమైన శిరాళ్ పండుగను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆంద్ ఆదివాసీలు నాగుల పంచమి మరుసటి రోజున శిరాళ్ పండుగను జరుపుకోవడం వారి సంప్రదాయంగా వస్తోంది. మహిళలంతా కలిసి ఉదయం పూట గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాలకు వెళ్లి మట్టి తీసుకుని వచ్చి ప్రతిమను తయారుచేశారు.
మహిళలంతా కలిసి భక్తి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం సద్గురు పూలాజీ బాబా మందిర్కు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శిరాళ్ ప్రత్యేక పూజలు నిర్వహించటం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని వారి నమ్మకం. అనంతరం శిరాళ్ మూర్తిని గ్రామ సమీపంలో నిమజ్జనం చేశారు.
![shiral-festival-held-in-a-grand-way-in-anji-village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8182567_841_8182567_1595775881022.png)