ETV Bharat / state

రిమ్స్‌ నుంచి కరోనా బాధితులు పారిపోవడం సిగ్గుచేటు : ఎంపీ సోయం - ఆదిలాబాద్​ రిమ్స్

రిమ్స్ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ఎందుకు పారిపోయారో మంత్రి ఈటల రాజేందర్ జవాబు చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు.

రిమ్స్‌ నుంచి కరోనా బాధితులు పారిపోవడం సిగ్గుచేటు : ఎంపీ సోయం

author img

By

Published : Aug 3, 2020, 7:15 PM IST

కొవిడ్‌ వైరస్ బారిన​ పడి ఆదిలాబాద్​ రిమ్స్‌లో చేరిన బాధితులకు వైద్యం అందక పారిపోవడం సిగ్గుచేటని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ప్రభుత్వంపై మండిపడ్డారు. రిమ్స్‌లో కొంతమంది వైద్యులు తమ ప్రైవేట్ నర్సింగ్‌ హోమ్‌ల కోసం వైద్య ఖాళీలు భర్తీ కాకుండా అడ్డుపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

సాక్షాత్తు ఆయనే వెల్లడించారు...

ఇందుకు స్థానిక ఎమ్మెల్యే అండగా నిలబడుతున్నారని సాక్షాత్తూ రిమ్స్‌ డైరెక్టర్‌ పరోక్ష వాఖ్యలు చేసిన విషయాన్ని పట్టణంలోని భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌తో కలిసి ఎంపీ గుర్తు చేశారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి : 'కరోనా వస్తే పెద్దోళ్లకు చేసే వైద్యమే పేదోళ్లకూ అందించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.