ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో రాష్ట్ర స్థాయి గిరిజన గురుకుల పోటీలు ముగిశాయి. చివరి రోజున... ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో సభ్యదేశాలు, వాదోపవాదాలు, ఆయా దేశాల సమస్యలను వివరించడంలో విద్యార్థులు ప్రతినిధులుగా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, నృత్య నాటికలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి. ముఖ్యఅతిథిగా హాజరైన గిరిజన గురుకుల ముఖ్య కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా విజేతలైన విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు.
ప్రపంచంలోని అన్ని రకాల ప్రాంతాలు ప్రదేశాలు వాతావరణ పరిస్థితులు సమకాలీన రాజకీయాలు చరిత్ర గురించి విద్యార్థులు ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండాలని ప్రవీణ్ కుమార్ అన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
- ఇదీ చూడండి : దమ్ము చూపండి.. దుమ్ము లేపండి