ఆదిలాబాద్లో ఆర్టీసీ సమ్మె రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలిరోజు 50 బస్సులు నడపగా ఈరోజు అదనంగా మరో 10 బస్సులు నడుపుతున్నారు. ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. బస్సులన్నీ నిండాకే కదులుతుండడం వల్ల ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. టికెట్ ధరలు అధికంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండో రోజు కండక్టర్ల నియామకానికి నిరుద్యోగులు డిపోల ముందు బారులు తీరారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి