ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ వైపు వెళ్లే రహదారిలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డంతా బురదమయమైంది. మరో వైపు వంతెన నిర్మాణంలో ఉండడం వల్ల బస్సు పైకి రాలేకపోయింది. అధికారులు తక్షణమే స్పందించి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయించి రహదారి కష్టాలు తొలగించాలని గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: వేగంగా బీఆర్కే భవన్కు కార్యాలయాల తరలింపు