ఆదివాసీల కోసం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయని సర్కారు..... అనుచిత వ్యాఖ్యలు చేసే మంత్రులకు మాత్రం ప్రైవేటు వర్సిటీలను కట్టబెట్టిందని....బహుజన సమాజ్ పార్టీ సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఆదిలాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీలో చేరిన పలువురికి కండువా కప్పి ఆహ్వానించారు. బీఎస్పీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.... సమావేశానికి వచ్చే కార్యకర్తలను బెదిరించారని....ఇకపై అటువంటి చర్యలు సహించబోమని హెచ్చరించారు.
మా ఆదివాసీ బిడ్డలకు, మా గిరిజన బిడ్డలకు రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు గానీ.. ఆగమేఘాల మీద ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల సాక్షిగా అసెంబ్లీలో ఆదరాబాదరాగా అనురాగ్ యూనివర్సిటీ దాని తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీ ఇచ్చిండ్రు. ఇగ మల్లారెడ్డిగారు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో.. మాట్లాడే భాష నేనిక్కడ చెప్పలేను.. చెల్లెల్లున్నరు, మా అవ్వలున్నరు, అక్కలున్నరు. ఆ భాష కూడా నేను మాట్లాడలేను. అసువంటి భాష ఆయన నేర్పిస్తున్నడు పిల్లలకు.
- ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ సమన్వయకర్త
అనంతరం జిల్లా కేంద్రంలోని కుమ్మరి, మేథరి కులస్తులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాలు ఏకమైతే... సబ్బండ వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల అండతో రాబోవు రోజుల్లో ప్రగతి భవన్‌లోకి ఏనుగును తీసుకెళ్లి అధికారంలోకి వస్తామని ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నిటికంటే ఆశ్చర్యకరమైన వార్త ఏంటంటే... ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఒకటుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్. దానికొక ఆఫీస్ ఉంటది. దానికొక ఛైర్మన్ ఉంటడన్న విషయం గూడ తెల్వదు. మరి ఇగ ప్రభుత్వం ఏం పని చేసినట్లో మీరు ఒకసారి ఆలోచించండి. అది చేసినం. ఇది చేసినం.. బంగారు తెలంగాణ అనే ప్రభుత్వం కనీసం వీళ్ల జీవితాల్లో చదువనే ఒక జ్ఞానజ్యోతిని వెలిగించే ప్రయత్నం అనేది చేయకపోవడమనేది చాలా చాలా శోచనీయం. సో మరి బహుజన సమాజ్వాదీ పార్టీ రేపు స్థాపించబోయే బహుజన రాజ్యంలో వీళ్లందరి జీవితాలు కూడా మారి వీళ్లందరి ఇళ్లల్లోకి గొప్ప సంపద వచ్చే విధంగా ప్లాన్ చేస్తం.
- ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ సమన్వయకర్త
ఇదీ చూడండి: Padayatra: కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకలిస్తాం: బండి సంజయ్