ETV Bharat / state

REVANTH REDDY: 'ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాక.. సంతలో ప్రశ్నపత్రాలు అమ్ముతున్నారు' - కాంగ్రెస్‌ నిరుద్యోగ దీక్ష

Telangana Congress Unemployement Protest Rally On Adaliabad: యువతకు ఉద్యోగాలు లేవనే ప్రత్యేకంగా తెలంగాణను సాధించుకున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో చెప్పాలని కోరారు. ఆదిలాబాద్‌లోని నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో ఆయన పాల్గొన్నారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Apr 26, 2023, 9:25 PM IST

Telangana Congress Unemployement Protest Rally On Adaliabad: ఏడాదికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. తెలంగాణ యువతను కేసీఆర్‌ నమ్మించి నట్టేట ముంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆరోపణలు చేశారు. ఆదిలాబాద్‌లోని నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ యువకులకు పేదరికం బాధలు ఏంటో తెలుసునని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఉద్యమంతో తెలంగాణను సాధించడం యువకులకు తెలుసునని వివరించారు. ఈ ఆదిలాబాద్‌ జిల్లా పోరాటాలకు మారు పేరు. ఆనాడు జల్‌- జమీన్‌- జంగిల్‌ నినాదంతో ఆదివాసీలు ఎంతో గొప్పగా పోరాడారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో తాగడానికి సాగు నీరు అందడం లేదని.. పొలాలకు సాగు నీరు అందడం లేదని.. యువతకు ఉద్యోగాలు లేవని ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని నినదించామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోనే సాగిందని వివరించారు. కాని ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకొని.. తొమ్మిదేళ్లు గడుస్తున్న ఇంకా వాటి గురించి పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Unemployement Protest Rally On Adaliabad: ఇలాంటి దుస్థితిని తీసుకు వచ్చిన ఈ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ పొలిమేర్ల వరకు తరిమి తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ఎక్కడా ఏ ఉద్యోగ నియామకం కూడా జరగలేదన్నారు. కేవలం కేసీఆర్‌ తన కుటుంబం, బంధువులకు మాత్రమే పదవులు ఇచ్చారు తప్ప.. ఇంకా ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వచ్చిన తర్వాత ఏ ఒక్కరైనా బాగుపడ్డారు అంటే.. అది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదన్నారు. ప్రభుత్వం నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ వంటి ప్రశ్నాపత్రాలు లీకవుతున్నాయని.. ఎందుకు లీకవుతున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పదో తరగతి పరీక్షలు కూడా ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతోందని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాక.. సంతలో ప్రశ్నాపత్రాలు అమ్ముతున్నారని ఆరోపణలు చేశారు. ఈ నిరుద్యోగ దీక్షా ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

"భద్రంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు.. బజార్‌లో ఆట వస్తువులాగా అమ్ముకుంటున్నారు. దీనికి కారణమైన కేసీఆర్‌ కుటుంబాన్ని యువత బయటకు లాగాలి. పబ్లిక్‌ సర్వీస్‌ ఛైర్మన్‌, సభ్యులను తక్షణమే తొలగించాలి. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలి. సిట్‌ కాకుండా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి." - రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాక.. సంతలో ప్రశ్నపత్రాలు అమ్ముతున్నారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.