ETV Bharat / state

'పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు ఉండాలి' - ఆదిలాబాద్​లో గణతంత్ర దినోత్సవాలు

ఆదిలాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్​ జాతీయ జెండాను ఎగురవేశారు.

republic day celebrations in adilabad collector
'పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు ఉండాలి'
author img

By

Published : Jan 26, 2020, 3:03 PM IST

ఆదిలాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గణతంత్రదినోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎస్పీ విష్ణువారియర్‌, ఎమ్మెల్యే జోగు రామన్న ఇతర అధికారలు, ప్రముఖులు, జిల్లావాసులు, విద్యార్థులు ఈ వేడుకలకు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల బాలికలు.. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా జానపదపాటలకు చేసిన నృత్యాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తొలుత పోలీసుల నుంచి పాలనాధికారి గౌరవవందనం స్వీకరించారు. ఎన్‌సీసీ క్యాడెట్లు, పోలీసు బలగాలు నిర్వహించిన కవాతు చూపరులను ఆకట్టుకుంది. అనంతరం పాలనాధికారి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.

'పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు ఉండాలి'

ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.