ETV Bharat / state

రిమ్స్‌లో దారుణం.. కడుపులో బిడ్డతో సహా గర్భిణీ మృతి

Pregnant and baby died: మరికాసేపట్లో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడాల్సిన పసికందు.. అమ్మ కడుపులోనే కన్నుమూసింది. తను 9 నెలలుగా మోస్తోంది ఆడబిడ్డో, మగబిడ్డో తెలియకుండానే.. ఆ పసికందును మోసిన కన్నతల్లి సైతం మృత్యుఒడికి చేరింది. సకాలంలో వైద్యం అందక, వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ రిమ్స్​లో చోటుచేసుకుంది.

pregnant died at RIMS
రిమ్స్​లో గర్భిణీ మృతి
author img

By

Published : May 20, 2022, 1:16 PM IST

Pregnant and baby died: నేడో, రేపో లోకాన్ని చూడాల్సిన కడుపులోని బిడ్డ సహా నిండు గర్భిణీ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్‌ రిమ్స్‌ వైద్యకళాశాలలో చోటుచేసుకుంది. తెల్లవారుజామునే వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీకి సకాలంలో వైద్యం అందకపోవడంతో... ఆ కాసేపటికే కడుపులోని బిడ్డ సహా గర్భిణీ మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఆదిలాబాద్‌ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన అక్షిత(23) తొమ్మిది నెలల గర్భవతి. ఇంట్లో ఉన్నప్పుడే తెల్లవారుజామున పురిటినొప్పులు రావడంతో ఆశాకార్యకర్తకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత అంబులెన్స్​లో రిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా అక్షితకు మధ్యలోనే ఫిట్స్‌ వచ్చాయి. ఆందోళన చెందిన కుటుంబీకులు.. అతివేగంగా ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రికి వెళ్లాక తమ బిడ్డకు సకాలంలో వైద్యం అందలేదని.. మత్తు, గైనిక్‌ వైద్యులు అందుబాటులో లేరని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. పురుటినొప్పులు భరించలేకనే కడుపులోని బిడ్డ సహా తమ కూతురు మృతిచెందిందని విలపించారు. దీంతో మృత దేహంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌, రాష్ట్రనాయకురాలు సుహాసినిరెడ్డి సంఘీభావం ప్రకటించారు.

విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న రిమ్స్‌ డైరెక్టర్‌ జై సింగ్‌, సూపరింటెండెంట్‌ అశోక్‌ విచారణకు ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని భాజపా నాయకులు డిమాండ్‌ చేశారు. విచారణలో తేలిన అంశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని డైరెక్టర్‌ తెలిపారు.

ఇవీ చదవండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ

'370 రద్దు వల్లే భారత్-పాక్ సంబంధాలు మరింత సంక్లిష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.