ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం రెండో వార్షికోత్సవాన్ని వంజరి కులస్థులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం వేకువజాము నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య యజ్ఞం, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ప్రతి ఏటా పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని.. అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారనే నమ్మకంతో ఈ పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఆషాఢం చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు చుద్దామా.!