ETV Bharat / state

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా... నర్సరీల ఏర్పాటుపై సర్కారు దృష్టి - తెలంగాణ హరితహారం తాజా వార్తలు

రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు సర్కారు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేపట్టిన హరితహారం... సత్ఫలితాలు ఇవ్వడం వల్ల... అదే స్పూర్తితో మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అటవీశాఖతో సంబంధం లేకుండా పంచాయతీలు, మున్సిపాల్టీల పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా... నర్సరీల ఏర్పాటుపై  సర్కారు దృష్టి

author img

By

Published : Oct 1, 2020, 2:28 PM IST

అడవుల ఖిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌ జిల్లా... ఒకప్పుడు 43శాతం అటవీ సంపదతో విస్తరించి ఉండేది. కానీ క్రమంగా అది 23శాతానికి పడిపోయింది. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సర్కారు తీసుకొచ్చిన హరితహారంలో భాగంగా జిల్లాలో పచ్చదనం పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీలతో పాటు 1,508 పంచాయతీల పరిధిలో వచ్చే ఏడాదిలోగా కనీసం 2 కోట్ల మొక్కలు పెంచాలని సర్కారు నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక నర్సరీలు ఏర్పాటుచేయాలని అధికారయంత్రాంగానికి సూచించింది.

అనువైన స్థలాల ఎంపిక

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్‌, మంచిర్యాల, కాగజ్‌నగర్, భైంసా పురపాలికలతో సహా నూతనంగా ఏర్పడిన పురపాలక సంఘాల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

ఊరికొకటి చొప్పున

పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బడ్డెట్‌లో 10శాతం నిధులు గ్రీనరికీ ఖర్చు చేసేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, సర్పంచులు, కార్యదర్శులతో పాటు ప్రత్యేకాధికారులకు బాధ్యతలను అప్పగించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీల పరిధిలో 55 నర్సరీలను, 1,508 పంచాయతీల్లో ఒక్కో పంచాయతీ ఒక్కో నర్సరీ ఏర్పాటు కోసం అనువైన స్థలం ఎంపికలో అధికారయంత్రాంగం కసరత్తు చేస్తోంది.

అదే లక్ష్యంతో..

హరితహారంలో మొక్కల కోసం అటవీశాఖపైనే ఆధారపడకుండా ఏర్పాటుచేస్తున్న నర్సరీల నిర్వహణ బాధ్యత అంతా స్థానిక సంస్థలకే అప్పగించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా పల్లె, పట్టణం అనే తేడాలేకుండా నాటిన మొక్కలన్నింటినీ సంరక్షించుకుంటే... రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చవచ్చనే ప్రణాళికతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

ఇదీ చూడండి: గ్రీన్​ ఛాలెంజ్​: కుమారుడితో కలిసి మొక్కలు నాటిన ప్రకాశ్​రాజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.