అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంతోపాటు లక్కారంలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కుక్క వీరంగం సృష్టిస్తూ ఏడుగురిని గాయపరిచడమే కాకుండా మూడు ఆవులను కరిచింది. మండలంలోని మత్తడికూడా పంచాయతీ పరిధి సుధాకూడాకు చెందిన భీమ్రావు, శ్రీ వంశీపై దాడి చేసింది.
రోడ్డుపై నడుస్తుండగా..
గుడ్లూరు మండల కేంద్రానికి వెళ్తూ గంగారాం గోవర్ధన్ అనే వ్యక్తిని గాయపరిచింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.
పిచ్చి కుక్క కరిచిన వెంటనే వైద్యం చేయించుకోవాలని స్థానిక వైద్యులు సూచించారు. ఈ తతంగం చూసిన యువకులు దాన్ని వెంబడించి ఉట్నూర్ మండల కేంద్రంలో హతమార్చారు. గ్రామంలో రోడ్డుపై తిరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది