- ఆమె గర్భిణి. నెలనెల ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న రిమ్స్ రిటైర్డ్ వైద్యురాలి వద్దనే చూయించుకుంది. తొమ్మిదో నెల బాలింతకోసం రిమ్స్‌కు రిఫర్‌చేసి ఆ వైద్యురాలే దగ్గరుండి పురుడు పోసింది. అదే సమయంలో ప్రైవేటులో మరో వైద్యురాలి వద్ద నెలనెల వైద్యం చేయించుకున్న మరో గర్ణిణిని పట్టించుకోలేదు. ఆ గర్భిణి తనను ప్రైవేటులో చూసిన మరో వైద్యురాలు వచ్చేంతవరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇదీ ఆదిలాబాద్‌లో ప్రైవేటు ప్రాక్టీసు చేసే గైనకాలజిస్టుల పనితీరు.
- పీజీ చదువుతున్న ఓ యువతికి చెయ్యిపై కాస్తత వాచి నొప్పిపెట్టడడంతో ఓ వైద్యుడికి చూయించింది. నాడీపట్టకుండానే రక్త థైరాడ్, ఎల్‌ఎఫ్‌టీ సహా 15రకాల పరీక్షలు చేయాలని పురమాయించాడు. గాబరాపడిన యువతి తల్లీతండ్రులు పరీక్షలు చేయించగా అన్నీ సాధారణంగానే ఉన్నట్లు తేలింది. చివరికి బలానికి రెండురకాలు, నొప్పితగ్గడానికి మరో రకమైన రాసిచ్చిపంపించాడు. కన్సల్టేషన్ ఫీజు రూ.250, పరీక్షలకోసం 1800 ఖర్చవుతే, మందుల కోసం రూ.450 అయింది.. ఆరోగ్యసమస్యలేదనే సంతోషంలోనే యువతి సహా వెంటవచ్చిన తల్లిదండ్రులు తిరిగి వెళ్లారే కానీ అనవసరంగా అన్నిరకాల పరీక్షలు చేయించారనే విషయం తెలుసుకోకపోవడం వైద్యుడికి కలిసివచ్చింది. ఇలాంటి ఘటనలు కోకొల్లలు...
వైద్యమంటేనే సేవ, స్వాహా కాదు. మానవీయ కోణంలో ఆలోచిస్తే వైద్యం విషయంలో రోగులు నిర్లక్ష్యం చేస్తే రోగులను నిందించాలి. వైద్యులు నిర్లక్ష్యం చేస్తే వైద్యులను తప్పుపట్టాలి. ఆదిలాబాద్‌లో ఆ విధానమే లేదు. రోగం నయమైతే వైద్యుల ఘనతగా, వికటిస్తే రోగుల తప్పిదంగా కొనసాగుతోంది. ఇటీవల ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంకు వచ్చిన తొమ్మిదినెలలు నిండి గర్భిణికి సకాలంలో వైద్యం అందించలేదు.
అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో రిమ్స్‌కు తరలించగా కడుపులోని మగబిడ్డ చనిపోగా తల్లి ప్రాణాలతో బయటపడింది. ఇదే నర్సింగ్‌హోంలో ప్రసవానికి వచ్చిన మహిళ కడుపులోని బిడ్డతో సహా తల్లీ మరణించడం విషాదాన్ని నింపింది. రెండు ఘటనల్లో బాధితులు ఆందోళనకు దిగగా ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులనే తేడాలేకుండా అంతా ఒక్కటై ప్రైవేటు నర్సింగ్‌హోం వైద్యురాలికి మద్దతుగా రావడం చర్చనీయాంశమైంది. ప్రాథమికంగా ఎలాంటి విచారణ చేయకుండానే రోగులదే తప్పన్నట్లుగా మాట్లాడటం వైద్యుల ఐక్యతను చాటింది.
నిబంధనలేమిటీ?
- ప్రైవేటు నర్సింగ్ హోంలు నిర్వహించే వైద్యులు తప్పనిసరిగా వారివద్ద ఉన్న సౌకర్యాలను ధరలతో సహా ప్రదర్శించాలి
- ప్రభుత్వ వైద్యులుగా లేదా రిమ్స్‌లో పనిచేసే విధులు నిర్వహించే వైద్యులైన ఎట్టిపరిస్థితుల్లో నర్సింగ్‌హోంలు నిర్వహించరాదు
- రిమ్స్ వైద్యులు నర్సింగ్‌హోంలు నిర్వహిస్తే రిమ్స్ డైరెక్టర్... ప్రభుత్వ వైద్యులు నిర్వహిస్తే డీఎంహెచ్‌వో చర్యలు తీసుకోవాలి
- నర్సింగ్‌హోంల్లో ఆక్సిజన్, వెలుతురు, పరిశుభ్రత, ప్రమాదాలకు విఘాతం కలిగించే ఎలాంటి అసౌకర్యాలు ఉండదకూదు
ఇదీ చదవండి : రిమ్స్‌లోనూ దిక్కులేని ఎంఆర్‌ఐ పరికరం