ETV Bharat / state

ఆధార్ కేంద్రాల్లో 'రేషన్' బారులు - adhar otp issues news

తొలిసారిగా ఓటీపీ విధానంలో రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కార్డుదారులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఓటీపీ విధానంలో సరుకులు తీసుకోవాలంటే ఆధార్ కార్డుకు సెల్​నెంబర్ అనుసంధానం తప్పనిసరి. ఈ ప్రక్రియ కోసం ఆధార్ నమోదు కేంద్రాలకు కార్డుదారులు క్యూ కడుతున్నారు వేకువజాము నుంచే ఆధార్ కేంద్రాలకు వెళ్లి పడిగాపులు కాస్తున్నారు.

పనిచేయని ఐరిశ్​... ఆధార్ కేంద్రాలకు బారులు తీరిన జనం

author img

By

Published : Feb 3, 2021, 12:21 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ లబ్దిదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా కలెక్టరేట్ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రం వద్ద సెల్​నెంబర్ అనుసంధానం కోసం పడిగాపులు కాస్తున్నారు. వేకువజాము నుంచి ఆధార్ కేంద్రాలకు బారులు తీస్తున్నారు. ఆధార్ నమోదు కేంద్రాలు పరిమిత సంఖ్యలో ఉండడం, కార్డుదారులు వేల సంఖ్యలో ఉండడం వల్ల కార్డుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.

ఆధార్ కేంద్రాలకు పరుగు...

ఆదిలాబాద్ జిల్లాలో 355 రేషన్ దుకాణాలున్నాయి. వీటి పరిధిలో లక్షా 88 వేల 549 రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఇందులో 94 వేల 274 మంది కార్డుదారులు మాత్రమే ఆధార్​కు చరవాణి అనుసంధానమై ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. సగం మందికి సెల్​నెంబర్ అనుసంధానం లేకపోవడం వల్ల వారంతా ఆధార్ నమోదు కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.

ఓటీపీ విధానం...

మూడు రోజుల నుంచి రేషన్ దుకాణాలు తెరుచుకోగా... ఓటీపీ విధానంలో సరుకుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓటీపీ రాని వారికి ఐరిశ్​తోనూ సరుకులు తీసుకునే అవకాశం ఉన్నా... వెలుతురు కారణంగా ఐరిశ్​ యంత్రాలు మొరాయిస్తున్నాయి.

అదే సమయంలో చరవాణి అనుసంధానం ఉన్నవారికి సరుకులు వెంటనే ఇస్తుండడం వల్ల మిగిలిన వారు ఆధార్ కేంద్రాలకు బారులు తీస్తున్నారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో బారులు తీరడం వల్ల వృద్ధులు, మహిళలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వేలిముద్రతోనే సరుకులు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఓటీపీతో రేషన్.. సామాన్యులకు తప్పని పరేషాన్...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.