ETV Bharat / state

Peas: పేదలకు అందని శనగలు... రేషన్ దుకాణాల్లో ముక్కిపోతున్న వైనం - Adilabad peas news

కరోనా మహామ్మారి ఎంతో మంది జీవితాలను కాకవికలం చేయగా... నిరుపేదలను రోడ్డున పడేసింది. అలాంటివారికి ఓదార్పునిచ్చేందుకు ప్రభుత్వం చౌకధరల దుకాణాలకు శనగలను సరఫరా చేసింది. ఏడాదిన్నర గడిచినా మార్గర్శకాలు విడుదల చేయకపోవడంతో ఇదంతా చెదలు పట్టింది. ఫలితంగా కోట్లాది రూపాయల విలువ చేసే శనగలను పడేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆదిలాబాద్‌ జిల్లాలో రేషన్‌ దుకాణాల్లో మూలుగుతున్న శనగలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

peas
శనగలు
author img

By

Published : Jul 30, 2021, 5:03 AM IST

పేదలకు అందని శనగలు...

ఆదిలాబాద్‌ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం పంపిణీ చేసిన శనగల(Peas)కు చెదలు పట్టాయి. కోట్లాది రూపాయల విలువచేసే శనగల్లో ఒక్క గింజ తినరాకుండా పోయింది. కరోనా సమయంలో వలసకార్మికుల ఆకలి తీర్చే ఉద్దేశంతో జిల్లాలోని 110 చౌకధరల దుకాణాలకు 52వేల 210 కిలోల బియ్యం, 6వేల 460 కిలోల శనగలను విడుదల చేసింది. ప్రతి కార్మికునికి రెండు కిలోల చొప్పున బియ్యం, కిలో చొప్పున శనగలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.

ముక్కిపోతున్న వైనం...

ఇందులో భాగంగా గోడౌన్ల నుంచి పౌరసరఫరాశాఖ యంత్రాంగం... ఆగమేఘాలమీద సరకులను చౌకధరల దుకాణాలకు తరలించింది. కానీ ఏడాదిన్నర గడుస్తున్నా నేటికీ మార్గదర్శకాలు విడుదల కాలేదు. పంపిణీ చేసిన శనగలు ముక్కిపోయి... పురుగులతో చెదలు పట్టి చౌకధరల దుకాణాల్లో మక్కిపోతున్న వైనం 'ఈటీవీ-ఈటీవీభారత్-ఈనాడు' పరిశోధనలో బయటపడింది. అంటే నిరుపేదల ఆకలి బాధకు అధికారులు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో ఈ ఘటన ద్వారా రుజువవుతోంది.

పట్టించుకునేవారేరి...

జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని 4 దుకాణాలకు పంపిణీ చేసిన దాదాపుగా 2వేల క్వింటాళ్ల శనగలు పంపిణీ చేయక మూలనపడేయడంతో పురుగుపట్టింది. పైగా బియ్యం నిలువలను పంపిణీ చేయడం లేదంటూ లబ్ధిదారులు తమతో గొడవలకు దిగుతున్నారనే రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది డీలర్లు సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకొచ్చినా... ఎవరూ పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యాన్ని వెల్లడిచేస్తోంది.

మార్గదర్శకాలు లేవు...

కాగా... ఈ విషయంలో అధికారుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. కరోనా సమయంలో వలసకార్మికుల ఆకలి తీర్చడానికి శనగలను పంపిణీచేసిన మాట వాస్తవమే అంగీకరిస్తున్నప్పటికీ... తరువాత ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదనే మాట వినిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా రేషన్‌ దుకాణాల్లో మూలుగుతున్న శనగలు ఇప్పుడు తినడానికి యోగ్యంగా లేనందున ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గోడౌన్లకు తరలిస్తామని చెప్పడం విశేషం.

సంబంధిత కథనాలు:

RAMAPPA TEMPLE: కాకతీయుల ప్రాభవానికి ప్రతీక.. రామప్పగుడి!

Choodamani on Ramappa : రామప్పపై యునెస్కోకు పుస్తకం రాశా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.