ఆదిలాబాద్లో భాజపా జిల్లా అధ్యక్షుడిగా పాయల్ శంకర్ రెండోసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు. మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. శంకర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని.. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని శంకర్ తెలిపారు.