ETV Bharat / state

అకాల వర్షానికి తడిసిన పంట - ఆదిలాబాద్ వార్తలు

అదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండలంలో పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నీట తడిసింది. మండల కేంద్రంతో పాటు.. పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం అకాల వర్షం కారణంగా తడిసి ముద్దయింది.

Paddy Drained In Rain In Adilabad District Utnoor
అకాల వర్షానికి తడిసిన పంట
author img

By

Published : May 14, 2020, 8:52 PM IST

అదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండల కేంద్రం పీర్​ సాయిబుపేట గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. రైతులు తెచ్చిన పంట తేమగా ఉందని.. అధికారులు కొనుగోలు ఆపేశారు.

నాలుగు రోజులుగా.. రైతులు వరి ధాన్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షానికి రైతులు తెచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ధాన్యం తడిసిందని, ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.