ETV Bharat / state

భూ తగాదా... ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులు - ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులు

ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలో వృద్ద దంపతులు ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. తమ భూమిని తమకు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్ ఎదుట పురుగుల మందుడబ్బాతో నిరసనకు దిగారు. ఇది గమనించిన పోలీసులు మందు డబ్బాను లాక్కుని అధికారుల వద్దకు తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

old couple commit suicide attempt
ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలో ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులు
author img

By

Published : May 17, 2021, 4:31 PM IST

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట వృద్ధదంపతులు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపడం కలకలం రేపింది. తమ భూమి తమకు ఇప్పించాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని వారు వాపోయారు. జిల్లాలోని బజార్‌హత్నూర్‌ మండలం కొత్తగూడకు చెందిన చవాన్‌ రాహుజీకి నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. వివాదం కారణంగా ఆ భూమిని సాగుచేయవద్దని ఏడాది క్రితమే అధికారులు ఆదేశాలు జారీచేశారు.

అయితే ఆ భూమిపై అధికారులు ఎలాంటి నిర్ణయం చెప్పడం లేదంటూ రైతు కుటుంబం కలెక్టరేట్‌కు వచ్చింది. న్యాయం చేయకపోతే పురుగులు మందు తాగుతామంటూ వృద్ధ దంపతులు నిరసన తెలిపారు. ఇదీ గమనించిన పోలీసులు మందు డబ్బాను లాక్కుని అధికారుల వద్దకు తీసుకెళ్లారు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు తమ గోడును వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయకపోతే చావే దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: రోజూ లక్ష పరీక్షలు చేయాలని ఎన్నిసార్లు ఆదేశించినా పట్టించుకోరా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.