ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ గోపాల్రావు ఆదిలాబాద్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఎస్ఈలు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన