ETV Bharat / state

పుస్తకాలు, కుర్చీలు తెచ్చుకుని... అవస్థలు పడుతూ... - ఆదిలాబాద్ లైబ్రరీ వార్తలు

Adilabad Central Library: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేయడంతో.. గ్రంథాలయాలకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రశాంతంగా చదువుకోవాలన్న ఆశతో వస్తున్న నిరుద్యోగులకు అసౌకర్యాలు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని కేంద్ర గ్రంథాలయంలో కనీసవసతులు కరవై ఉద్యోగార్థులు నానా అవస్థలు పడుతున్నారు.

adilabad librery issues
adilabad librery issues
author img

By

Published : Mar 30, 2022, 4:52 PM IST

పుస్తకాలు, కుర్చీలు తెచ్చుకుని... అవస్థలు పడుతూ...

Adilabad Central Library: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంగా అర్ధదశాబ్దపు చరిత్ర కలిగిన ఏకైక కేంద్ర గ్రంథాలయం ఇది. రాష్ట్రంలోని ఒకేసారి 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి... ఈ గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది. అది ఎంతగా అంటే వచ్చిన వారికి సరిపడా కుర్చీలు లేనంతగా. రోజుకు ఇక్కడికి 300 మందికి తగ్గకుండా యువతీ, యువకులు వచ్చి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

వేలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నా అవి పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి లేకపోవడంతో... సొంతంగా అవసరమైన పుస్తకాలను వెంట తెచ్చుకుంటున్నారు. వేసవి కావడంతో ఏసీలు, కూలర్లు పనిచేయక ఉక్కపోతతో పఠనంపై సరైన దృష్టిసారించలేని పరిస్థితి ఉంది. వైఫై లేని కారణంగా కంప్యూటర్లు మూలన పడి ఉంటున్నాయి. కోరిన పుస్తకాలు తెప్పించడంలేదని, కుర్చీలు తామే తెచ్చుకుంటున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

మధ్యాహ్నం వేళ కింద కూర్చుని భోజనం చేయాల్సి వస్తోందని.. టాయిలెట్‌, చల్లటి తాగునీటి వసతి సమకూర్చాలని అభ్యర్థులు కోరుతున్నారు. నోటిఫికేషన్ల ప్రకటనతో గ్రంథాలయానికి మునపెన్నడూ లేనివిధంగా... అభ్యర్థులు వస్తున్నారని, నిధుల కొరతతో సరైన వసతులు కల్పించలేకపోతున్నామని అధికారులు అంగీకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి.. కనీస వసతులు కల్పించే ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకు మేలు చేసిన వారవుతారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

ఇదీ చదవండి : రెండు తలలు, మూడు చేతులతో అరుదైన శిశువు జననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.