ప్రతి ఏటా పుష్యమి అమావాస్య రోజున మెస్రం వంశీయులు నాగోబా జాతర నిర్వహిస్తారు. డోలు, తుడుం, పొంగాడల వాయిద్యాల నడుమ మహా క్రతువును ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా అధికారులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. గోదావరినది నుంచి మెస్రం వంశీయులు తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం భక్తులపై చల్లడంతో పూజ ఆరంభమవుతుంది. ఈ నెల 12న ముగియనున్న ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలుగురాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి తరలివచ్చిన భక్తులు నాగోబా సన్నిధిలోని మర్రిచెట్ల నీడన సేదతీరారు. జాతర ముగిశాక భక్తుల సంప్రదాయ భేటి (పరిచయ కార్యక్రమం) కొనసాగనుంది. ఆదివాసీల సమస్యలను దరఖాస్తుల రూపంలో స్వీకరించేందుకు ఈ నెల 7న గిరిజన దర్భార్ జరిపేందుకు అధికారులు నిర్ణయించారు.