ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. బెంగుళూరు నుంచి వచ్చిన న్యాక్ బృందం సందర్శించింది. న్యాక్ ఛైర్మన్ డా.ప్రవీణ్ త్రివేది సారథ్యంలోని సభ్యులు ప్రొ. డా.జుగల్ కిషోర్ మిశ్రా, డా.గోపాల్ కల్కోటీకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
కళాశాల వసతులపై సభ్యులు ఉదయం ఆరా తీశారు. పూర్వ, ప్రస్తుత విద్యార్థులతో మధ్యాహ్నం సమావేశమయ్యారు. కళాశాలకు మంచి గ్రేడ్ ఇచ్చేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని ఛైర్మన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మార్చి 22 నుంచి కృత్రిమ మేథపై మరింత శిక్షణ: టీటా డిజిథాన్