ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. రైతు వేదిక, కలెక్టర్ కార్యాలయం కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోనే ఎస్సీలకు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు.
అధికార పార్టీ వారు భూములను లాక్కుంటే.. బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షాలు స్పందించడం లేదన్నారు. బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం సాధించినప్పుడు.. కోల్పోయిన భూములను తిరిగి పొందే వీలుంటుందన్నారు.
ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు