ఎస్సీ, ఎస్టీలు సాగు చేస్తున్న భూములను అధికార పార్టీ నేతలు, అధికారులు బలవంతంగా లాక్కుని ఆయా అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ నిరాహార దీక్ష చేపట్టింది.
పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు వంటివి ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో ఏర్పాటు చేస్తున్నారని నాయకులు ఆరోపించారు.