కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆదివారం జరిగే జనతా కర్ఫ్యూలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎంపీ సోయం బాపూరావు సూచించారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ప్రజలు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతతో ఉండి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలంతా సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా వైరస్‌పై పోరుకు భారత్ సరికొత్త వ్యూహం