ఆదిలాబాద్‌లో కరోనా కట్టడిలో భాగంగా అధికార యంత్రాంగం సంచార ఏటీఎం వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారంతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది. సంచార ఏటీఎం ఏర్పాటుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంచార ఏటీఎం నుంచి... ఖాతాదారులు ఏ బ్యాంకు వారైనప్పటికీ డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్