ETV Bharat / state

మహానీయుల అడుగుజాడలో నడవండి: రేఖ నాయక్ - adilabad district utnoor mandal latest news

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కేంద్రంలో కవి సామ్రాట్ అన్న బావు సాఠే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రాథోడ్ రేఖ నాయక్, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఈ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొన్నారు.

mla-rekhanayak-inaugurate-kavisamrat-anna-bapu-satte-statue
మహానీయుల అడుగుజాడలో నడవండి
author img

By

Published : Dec 16, 2020, 10:36 PM IST

తన కలంతో సమాజంలో వివక్షను ఎక్కుపెట్టిన కవి సామ్రాట్ అన్న బావు సాఠే .. ఆ మహానీయుడి విగ్రహాన్ని ఉట్నూర్ మండల కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రాథోడ్ రేఖ నాయక్ ఆవిష్కరించారు. ఈ విగ్రహా ఆవిష్కరణకు సాఠే కార్యవర్గ సభ్యులు ఖానాపూర్ ఎమ్మెల్యే రాథోడ్ రేఖ నాయక్​తో పాటుగా .. అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్​కు ఘనంగా స్వాగతం పలికారు. నూతనంగా ఏర్పాటు చేసిన సాహితి వేత్త సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ రేఖ నాయక్ మాట్లాడుతూ.. మహానీయుడు అన్న బావు సాఠే అడుగుజాడలో నడిచి అయన కలలను నిజం చేయాలని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సీలకు దళిత బస్తీ, మూడెకరాల భూమి అందించేలా కృషి చేస్తామని జడ్పీ ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ విషయమై ఖానాపూర్ ఎమ్మెల్యేతో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

ఇదీ చదవండి:ప్రతిధ్వని: ధరల పెంపు.. సామాన్యుడిపై ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.