ETV Bharat / state

ఎంపీ వ్యాఖ్యలు అవాస్తవం, హాస్యాస్పదం: రామన్న

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని ఎంపీ బాపురావు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్‌లోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో రూ. 2 కోట్ల 12లక్షల వ్యయంతో చేపట్టనున్న బీటీరోడ్డు నిర్మాణ పనులకు పురపాలక సంఘం ఛైర్మన్‌ ప్రేమేందర్‌తో కలిసి ఆయన భూమిపూజ చేశారు.

MLA Joguramanna fires on BJP leaders
ప్రభుత్వ పథకాల్లో కేంద్రం నిధుల్లేవు: ఎమ్మెల్యే జోగు రామన్న
author img

By

Published : Nov 19, 2020, 7:10 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు లేనే లేవని ఆదిలాబాద్‌ శాసనసభ్యుడు జోగు రామన్న వ్యాఖ్యానించారు. హౌసింగ్‌ బోర్డు కాలనీలో రూ. 2 కోట్ల 12లక్షల వ్యయంతో చేపట్టనున్న బీటీరోడ్డు నిర్మాణ పనులకు పురపాలక సంఘం ఛైర్మన్‌ ప్రేమేందర్‌తో కలిసి భూమిపూజ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనసాగుతున్నాయని ఎంపీ సోయం బాపురావు ప్రకటించడాన్ని జోగు రామన్న ఆక్షేపించారు. నిజంగానే భాజపా నిధులు కేటాయిస్తే ... ఆపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలాంటి పథకాలు ఎందుకు అమలుకావడంలేదని జోగు రామన్న ప్రశ్నించారు.

ఇదీ చదవండి: 'వరదసాయం కింద కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.