రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగానే కేజీబీవీలకు రూపకల్పన జరుగుతోందని... ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.
విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేద విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసే విధంగా తెరాస సర్కారు ముందుకు వెళుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వామన్‌రావు కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ