ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదిలాబాద్‌లో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే జోగురామన్న ఖండించారు. భాజపానాయకులే అవినీతిపరులని ధ్వజమెత్తారు. ఎంపీ సోయం బాపురావు, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అవినీతి దందాపై త్వరలో వివరాలు వెల్లడిస్తానని జోగు రామన్న పేర్కొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. దమ్ముంటే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించి నిరూపించాలే తప్ప అనవసరంగా విమర్శలు చేయవద్దని హితవు పలికారు. ఏ మాత్రం అవగాహనలేకుండా కిషన్‌రెడ్డి మాట్లాడారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: అధికార పార్టీ అని భరించాం.. ఇక మా వల్ల కాదు: సర్పంచ్లు