ETV Bharat / state

మొక్కలు నాటాలి.. వాటిని సంరక్షించాలి: ఎమ్మెల్యే - mla azmeera rekha nayak latest news

వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఉట్నూర్‌ ఎమ్మల్యే అజ్మీరా రేఖ నాయక్‌ కోరారు. ఆదిలాబాద్‌ జిల్లా శ్యాంపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం తీరుపై ఆరా తీశారు.

మొక్కలు నాటాలి.. వాటిని సంరక్షించాలి: ఎమ్మెల్యే

author img

By

Published : Jul 2, 2020, 7:12 PM IST

కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఉట్నూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ కోరారు. గురువారం అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లింగోజీ తాండ, శ్యాంపూర్ గ్రామాల్లో ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

రానున్న రోజుల్లో గ్రామాలన్నీ పచ్చని వాతావరణంతో కళకళలాడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం శ్యాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సంబంధిత వైద్య సిబ్బందిని.. రోగులకు అందుతున్న వైద్యం తీరును అడిగి తెలుసుకున్నారు. రోగులకు దోమతెరలు అందించారు. రోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అజ్మీరా రేఖ నాయక్‌ పేర్కొన్నారు.

ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.