ETV Bharat / state

'ఆ వర్గాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ కేటాయింపులు' - Indrakaran Reddy happiness on budget

రాష్ట్ర బడ్జెట్​లో ద‌ళితుల అభ్యున్నతికి రూ.వెయ్యి కోట్ల నిధుల‌తో ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్ అనే ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టినందుకు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తాను నిర్వహిస్తున్న‌‌, అట‌వీ, దేవాదాయ‌, న్యాయ శాఖ‌ల‌కు కేటాయింపులు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలియజేశారు.

minister-indrakaran-reddy-said-budget-allocation-to-illuminate-schedule-categories
'ఆ వర్గాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ కేటాయింపులు'
author img

By

Published : Mar 18, 2021, 4:39 PM IST

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆంకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా పూర్తి స్థాయి బడ్జెట్‌కు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపకల్పన చేశారని మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. కరోనా క్లిష్ట సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ.. సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని మంత్రి పేర్కొన్నారు.

ద‌ళితుల అభ్యున్నతికి రూ.వెయ్యి కోట్ల నిధుల‌తో ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్ అనే ప‌థ‌కాన్ని రూపొందించి... సీఎం కేసీఆర్ షెడ్యూల్ కులాల వ‌ర్గాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ కేటాయింపులు చేశార‌ని హర్షం వ్యక్తం చేశారు. తాను నిర్వహిస్తున్న‌‌, అట‌వీ, దేవాదాయ‌, న్యాయ శాఖ‌ల‌కు అధిక‌ బ‌డ్జెట్ కేటాయింపులు చేసినందుకు సీఎం కేసీఆర్​కు కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఈ నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు దేవాలయాల అభివృద్ది ప‌నులు, దేవాలయాల్లో ధూప, దీప నైవేద్య పథకం అమ‌లు, అర్చకులు, ఆల‌య ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం కోసం వెచ్చిస్తామ‌ని చెప్పారు.

ఇదీ చూడండి : 'ఆ సమయంలో.. ఒక్కసారి అమ్మానాన్నల్ని తలుచుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.