ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో రూ.10లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సంచార బయో టాయిలెట్ బస్సును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. రూ.5లక్షలతో ఆర్టీసీ పాత బస్సును కొనుగోలు చేసి.. మరో రూ.5లక్షలతో మహిళలు, పురుషులకు వేర్వేరుగా మూత్రశాలలు, వాష్‌రూంలను ఏర్పాటు చేసి ఆధునీకరించారు.
జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బస్సులను నిలుపుతారు. ఈ బస్సులో బాలింతలు పిల్లలకు పాలు పట్టేలా ఓ గదినీ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: మమతXసువేందు: 'మెగా వార్' విజేత ఎవరు?