రైతు బంధు రాదని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. పంట సాగు చేసే ప్రతి అన్నదాతకు రైతు బంధు వస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టంచేశారు. సోయా కొరతను అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదని ఇంద్రకరణ్ రెడ్డి భరోసా ఇచ్చారు.
"ఆదిలాబాద్లో సాగు చేస్తున్న పంటల్లో ఎక్కడా.. ఏమంతా తేడా లేదు. కాబట్టి రైతుబంధు రాదనే సమస్య ఎక్కడా కూడా లేదు. రైతుబంధు కచ్చితంగా అందరికీ వస్తుంది."
-అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి
ఆదిలాబాద్ జడ్పీ హాల్లో జరిగిన నియంత్రిత పద్ధతి సాగుపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్ధన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాఠోడ్ బాపూరావు, ఆత్రం సక్కు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు