మిడతల దండు మహారాష్ట్ర నుంచి తొలుత ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రవేశించే అవకాశమున్నందున ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేశారు.
సమీక్షలో జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు జోగురామన్న, రాఠోడ్ బాపురావు, కలెక్టర్ శ్రీదేవసేన, ఇతర అధికారులు పాల్గొన్నారు.