ETV Bharat / state

జనతా కర్ఫ్యూతో పెళ్లిళ్లు వాయిదా - ఆదిలాబాద్​ తాజా వార్త

జనతా కర్ఫ్యూనకు సహకరిస్తూ ఆదిలాబాద్​ జిల్లాలో ఈరోజు జరగాల్సిన రెండు పెళ్లిళ్లను కుటుంబసభ్యులు వాయిదా వేసుకున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వానికి సహకరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

marriages are postponed at adilabad due to janatha kurfue
జనతా కర్ఫ్యూతో పెళ్లిళ్లు వాయిదా
author img

By

Published : Mar 22, 2020, 9:51 AM IST

జనతా కర్ఫ్యూ కారణంగా ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు పెళ్లిలు వాయిదా వేసుకోవాల్చి వచ్చింది. నేరడిగొండ మండలం వాగ్ధారి గ్రామానికి చెందిన జయశ్రీతో ఇచ్చోడకు చెందిన శ్రీనివాస్‌కు నెలరోజుల కిందట పెళ్లి నిశ్చయమైంది. ఈరోజు వాగ్ధారిలో పెళ్లి జరగాల్సి ఉంది. కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనతా కర్ఫ్యూనకు పిలుపు నివ్వడం వల్ల ఇరు కుటుంబాలవారు సమాలోచనలు జరిపారు.

జనతా కర్ఫ్యూతో పెళ్లిళ్లు వాయిదా

బంధుమిత్రులు ఎవరూ లేకుండా పెళ్లి జరగడం బాగుండదనే ఆలోచనతో పాటు దేశహితాన్ని కోరి పెళ్లిని వాయిదా వేసుకోవడమే మంచిదనే ఆలోచనకు వచ్చారు. మరోపక్క ఇచ్చోడ మండలానికి చెందిన ఆత్రం లక్ష్మణ్‌, శాంతలకు జరగాల్సిన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నారు. తదుపరి తేదీలను తరువాత ముహుర్తాలు చూసుకుని నిర్ణయిస్తామని పెళ్లి కూతురు జయశ్రీ తండ్రి భూమన్న తెలిపారు.

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.