ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 15 మంది బాధితులు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా జైనథ్, ఇచ్చోడకు చెందిన మరో ఇద్దరికి కొవిడ్ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరింది.
క్షయవ్యాధితో బాధపడుతున్న ఇచ్చోడకు చెందిన ఓ మహిళ ఇటీవల వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా కరోనా పాజిటివ్ అని తేలింది. అక్కడ్నుంచి నేరుగా ఇచ్చోడకు తిరిగి వచ్చిన ఆమె కరోనా విషయం బయటపెట్టలేదు. విషయం తెలసుకున్న వైద్యశాఖ సిబ్బంది ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
జైనథ్‌కు చెందిన మరో ఆటోడ్రైవర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలో మొత్తం 17 మంది బాధితుల్లో 16 మంది రిమ్స్ ఆసుపత్రి ఐసోలేషన్‌లో చికిత్ప పొందుతుండగా.. మరొకరు స్థానిక సంజయ్‌నగర్ కాలనీలో హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు కొవిడ్ నోడల్ అధికారి తెలిపారు. అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ జైనథ్, ఇచ్చోడ కేంద్రాల్లో వ్యాధి బారిన పడిన బాధితుల ఇళ్లకు 100 మీటర్ల వైశాల్యంలో ముందు జాగ్రత్తలు చేపట్టింది.
ఇదీ చూడండి: గుడ్‌న్యూస్: ఐటీ సంస్థల అవకాశం... అభ్యర్థుల్లో ఆనందోత్సాహం