ETV Bharat / state

మార్కెట్లు, జిన్నింగ్‌లలో కాంటాల నిర్వహణపై కొరవడిన పర్యవేక్షణ - Adilabad agriculture market news

ఆదిలాబాద్‌ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు, జిన్నింగ్‌ మిల్లులపై తూనికలు, కొలతల విభాగం అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఆదిలాబాద్‌, జైనథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్‌ మార్కెట్‌ యార్డుల్లో తనిఖీలు లేక ఇష్టారాజ్యంగా మోసాలు సాగుతున్నాయి.

మార్కెట్లు, జిన్నింగ్‌లలో కాంటాల నిర్వహణపై కొరవడిన పర్యవేక్షణ

author img

By

Published : Nov 8, 2020, 5:09 AM IST

మార్కెట్లు, జిన్నింగ్‌లలో కాంటాల నిర్వహణపై కొరవడిన పర్యవేక్షణ

ఆదిలాబాద్‌ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు, జిన్నింగ్‌ మిల్లులపై తూనికలు, కొలతల విభాగం అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఆదిలాబాద్‌, జైనథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్‌ మార్కెట్‌ యార్డుల్లో తనిఖీలు లేక ఇష్టారాజ్యంగా మోసాలు సాగుతున్నాయి. ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో గత నెల 29న సీసీఐ... పత్తి కొనుగోళ్లు ప్రారంభించింది. అదేరోజు ఓ రైతు పత్తిని తూకం వేయగా 4 క్వింటాళ్లు తేడా వచ్చింది.

సీసీఐ అధికారులు గమనించి రైతుకు చెప్పగా... మార్కెట్‌యార్డులోని కాంటాను సరిచేశారు. జందాపూర్‌కు చెందిన మరో రైతు తన సోయా పంటను ప్రైవేటు జిన్నింగ్‌కు తరలించగా... ఏకంగా 10 క్వింటాళ్ల తేడా వచ్చింది. ఇంత జరిగినప్పటికీ తూనికలు, కొలతల అధికారులు యార్డుల వైపు కన్నెత్తి చూడలేదు. గుత్తేదారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: అందుకనుగుణంగా ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.