ETV Bharat / state

ఆపేసింది కరోనా.. ఆదుకుంటోంది కరుణ!

author img

By

Published : May 3, 2020, 8:11 AM IST

కరోనా నేపథ్యంలో జిల్లాలో చిక్కుకున్న వలస కార్మికుల సహాయార్థం ప్రభుత్వపరంగా నిధులు అందక అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వీరిని ఆదుకునేందుకు దాతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌ అనంతరం అధికారయంత్రాంగం వలస కార్మికులతోపాటు బాటసారుల కోసం అయిదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించింది. కానీ నిధులు విడుదల కాకపోవడంతో సంబంధిత అధికారులంతా ఖర్చుల కోసం దాతలవైపు చూడాల్సి వస్తోంది.

lack of funds to serve migrant labor in corona crisis
ఆపివేసింది కరోనా.. ఆదుకుంటోంది కరుణ..

ఆదిలాబాద్‌ జిల్లాలోని నేరడిగొండ, ఉట్నూర్‌ మండలాల పరిధిలో కరోనా పాజిటివ్‌ నమోదైన వెంటనే అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద నివారణ చర్యలు చేపట్టింది. జిల్లాలో ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికులతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన బాటసారులను కలిపి దాదాపుగా 720 మదిని గుర్తించి అయిదు పునరావాస కేంద్రాలకు తరలించింది.

ఆదిలాబాద్‌ సమీపంలోని గాయత్రీ ఫంక్షన్‌హాల్‌లో 350 మందిని, సంజయ్‌నగర్‌లోని కస్తూర్బా విద్యాలయంలో 55 మందిని, జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న బీసీ వసతి గృహంలో 60 మందిని, తాంసి బస్టాండ్‌ సమీపంలోని మెప్మా కేంద్రంలో 60 మందిని, రిమ్స్‌ ఆసుపత్రి కేంద్రంలో మరో 70 మందిని, చాందా(టి) సమీపంలోని మైనార్టీ గురుకులంలో 125 మందిని ఉంచారు. వీరిలో కొంతమంది కేంద్రాలకు రాకుండా పోయిన వారిని మినహాయిస్తే మిగిలిన 650 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వ పరంగా భోజనం, ఇతరత్రా కనీస అవసరాలను కల్పించాల్సి ఉంది. కానీ నిధులు సరిగా అందక సంబంధిత బాధ్యతలను పర్యవేక్షిస్తున్న అధికారులు దాతలపైనే ఆధారపడాల్సి వస్తోంది.

ఒకపూట భోజనం కోసం సగటున రూ. 50 చొప్పున పరిగణనలోకి తీసుకుంటే 650 మంది భోజనానికి 32,500 వెచ్చించాల్సి ఉంది. ఓపూట ఛాయ్‌, అల్పాహారానికి కనీసం రూ. 25 చొప్పున పరిగణనలోకి తీసుకుంటే రూ.1625 వెచ్చించాల్సి ఉంది. రెండు పూటలు భోజనం, ఓ పూట ఛాయ్‌ అల్పాహారం అంటే కనీసం రోజుకు రూ. 81,250 చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు ఆరోగ్య ఖర్చులు, మాస్కులు, శానిటైజర్లు, మంచినీటి సరఫరా, పునరావాస కేంద్రాల కనీస వసతులు, విద్యుత్తు ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంది. కానీ వీటిపై ఇప్పటికీ అధికారుల్లో స్పష్టత లేదు.

పునరావాస కేంద్రాలను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారులు తమ ఇబ్బందులను ఉన్నతాధికారులకు చెప్పలేక పోతున్నారు. కరోనా నివారణ చర్యల కోసం ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీచేసింది..? నిధుల వినియోగంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు దాతల వైపు చూడాల్సి వస్తోంది. కొంతమంది అన్నం, పప్పు, ఓ కూర వడ్డించడానికి వచ్చినప్పుడు అధికారులు మంచినీళ్ల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో దాతలంతా జాతీయ రహదారి వెంట వెళ్తున్న వారి కోసం బయలుదేరితే అధికారులు నిత్యావసర సరకుల కోసం, వంటగ్యాసు కోసం జేబుల్లో నుంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.

రూ. 56 వేల విద్యుత్తు బిల్లు

ఆదిలాబాద్‌ సమీపంలోని గాయత్రీ ఫంక్షన్‌హాల్‌ని మార్చి 26న అధికారులు పునరావాస కేంద్రంగా మార్చారు. 350 మంది వలస కార్మికులు ఉన్న ఈ కేంద్రంలో ఇప్పటివరకు 4 వేల యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది. యూనిట్‌కు రూ. 14 చొప్పున మొత్తం రూ. 56 వేలు చెల్లించాల్సి ఉంది. రోజూ క్వారంటైన్‌ పరిసరాల పరిశుభ్రత నిర్వహణ కోసం అదనంగా రోజుకు రూ. 500 చొప్పున 40రోజులకు కలిపి మరో రూ. 20వేలు అయ్యింది. పెళ్లిళ్లు, పేరంటాలకైతే ఒక్కరోజు ఫంక్షన్‌హాల్‌కు రూ. 35 వేలు ధర ఉంటుంది. కనీసం విద్యుత్తు ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు కూడా అధికారులు చెల్లించలేదనేది యజమాని ఆవేదన.

నిధులు రాలేదు

కరోనా నివారణకు సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు. ప్రభుత్వం నిధులు కేటాయించిన తరువాత నిబంధనలకు అనుగుణంగా చెల్లిస్తాం. ప్రస్తుతానికి సంబంధిత అధికారులు వలస కార్మికులు, బాటసారులకు ఏ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. పునరావాస కేంద్రాల నిర్వహణలో భాగంగా విద్యుత్తు ఛార్జీలు చెల్లించడానికి ప్రయత్నిస్తాం.

- డేవిడ్‌, జిల్లా అదనపు పాలనాధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.