ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల మెడికోలు తాము తిన్న భోజనం వికటించి అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించగా మెడికోలు ఒకరోజు ముందుగానే రిమ్స్ వసతి గృహానికి చేరుకున్నారు.
ఈరోజు మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనం చేసిన 28 మంది విద్యార్థినులకి కడుపు నొప్పి, వాంతులు చేసుకున్నారు. వారందరిని ఆసుపత్రికి తరలించారు. భోజనంలో అన్నం, టమాటా, పప్పు తిన్నట్లుగా సహచర విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని డైరెక్టర్ బలరాం బానోత్ తెలిపారు.
ఇదీ చూడండి: మంత్రి హరీశ్‌రావు చొరవ... వీధి వ్యాపారులకు భరోసా